సరిగ్గా అర్ధం చేసుకుంటే.. పార్టీలకు, రాజకీయాలకు అతీతంతా ఆలోచిస్తే.. కరోనా విషయంలో జగన్ చెప్పిన మాటలు, చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజలకు అండగా ఉన్న విధానాలు కచ్చితంగా అభినందనీయమే! ఇది అంగీకరించడం కొంతమందికి ఏమాత్రం సాధ్యం కాకపోయినా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అర్ధమైతే చాలు అనేది కొందరి ఆలోచన! ఆ సంగతులు అలా ఉంటే… కరోనా వచ్చిన కొత్తలో జగన్ చెప్పిన మాటలే నేడు బాలయ్య కూడా చెప్పడం సంచలనంగా మారింది!
కరోనా గురించి ఎవరూ బయపడకండి.. కాస్త ఇమ్యునిటీ పవర్ ఉంటే అది పెద్ద విషయం కాదు. భయం అస్సలు దగ్గరకు రానివ్వకండి.. ధైర్యంగా ఎదుర్కొండి అని! అయితే ఆ మాటలు ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. కరోనాను అంత తేలిగ్గా తీసుకోవద్దని… వారు బయపడి దాక్కోవడమే కాకుండా జనాలను మరింతగా భయపెట్టే మాటలు మాట్లాడారు! కరోనాను నిర్లక్ష్యం చేయకూడదు కానీ… భయపడకూడదు కదా!
తాజాగా ఈ విషయాలపై స్పందించిన బాలయ్య కూడా… ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎవరికైనా కరోనా వచ్చింది, పాజిటివ్ అని తేలింది అని తెలియగానే అంతా కంగారు పడిపోతున్నారు.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఇలాంటి పనులు చేయడం ఏమాత్రం మంచిది కాదు. రకరకాల ట్రీట్ మెంట్స్ వచ్చాయి.. ధైర్యంగా ఉండండి.. అని బాలయ్య స్పందించారు!
ఇక్కడ మరో చిత్రమైన సంఘటన ఏమిటంటే… టీడీపీ అధినేత చంద్రబాబు, చినబాబులు ఇంట్లోనే ఉంటుంటే… బాలయ్య మాత్రం బయటకు వస్తూ బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ని రెగ్యులర్ గా సందర్శిస్తూ.. వైద్యులకు, వైద్య సిబ్బందికి మరింత ధైర్యం చేబుతూనే ప్రజలకు భరోసా ఇస్తూ ఇలాంటి ధైర్యమైన మాటలు మాట్లాడుతున్నారు!!