BREAKING : నందమూరి తారక రత్నకు గుండెపోటు

-

BREAKING : నందమూరి ఫ్యాన్స్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. నందమూరి తారక రత్నకు గుండెపోటు వచ్చింది. నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు నందమూరి తారకరత్నకు గుండె పోటు రావడంతో.. సోమసిల్లి పడిపోయాడు.

పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్థనలు నిర్వహించగా, తారకరత్న కూడా పాల్గొన్నారు. లోకేష్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా టిడిపి కార్యకర్తలు తరలి రావడంతో వారి తాకిడికి తారకరత్న కి గుండె పోటు వచ్చి… పడిపోయాడు. ఆయన్ను కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version