కోర్టులో లొంగిపోయిన నందిగం సురేష్.. బెయిల్ మంజూరు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్య పరిణామాలు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం  హయాంలో జరిగిన ఆకృత్యాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక్కొక్కరిని అరెస్ట్  చేస్తున్న ప్రభుత్వం.. దళిత మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్  ను గతంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన సుదీర్ఘ రిమాండ్ అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇటీవల జైలు నుంచి విడుదల అయ్యారు.  కొద్దిరోజులకే మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

తాజాగా ఎవ్వరూ ఊహించనివిధంగా ఇవాళ నందిగం సురేష్ కోర్టులో లొంగిపోయారు. ఈ వ్యవహారంలో సురేష్ తో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మరికొందరి పై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం అండదండలతో వీరిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. అతని తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారించిన సివిల్ జడ్జీ నందిగం సురేష్ కి బెయిల్ మంజూరు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version