శీతాకాలం అంటే అనేక జబ్బులకు నిలయం..ఈ సీజన్ లో చాలా రకాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారి కళ్ల జోడు పెట్టుకోవడం మంచిది. సాధారణంగా వ్యాధినిరోధక శక్తి తగ్గినపుడు అలర్జీలు వస్తాయి. కొన్ని వ్యాధులు అప్పుడప్పుడు రావడం సహజం. కానీ, వాటిని మనం ముదరకుండా చూసుకోవాలి. కంటి ఎలర్జీలు వచ్చినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కంటి నల్లని ఆకారం చుట్టూ ఎర్రని మచ్చలు ఏర్పడితే.. అప్పుడు కార్నియా సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సంకేతం. ఇది ఎక్స్‌పైర్ అయిన లేదా నిరంతరం పెట్టుకునే కాంటాక్ట్ లెన్స్ వల్ల వస్తుంది. కళ్లు ఎర్రగా మారితే నిద్ర సరిపోలేదని అర్థం. కాటువ లేదా చుండ్రు సమస్య ఉన్నపుడు కూడా ఎలర్జీ వస్తుంది. వీటికి యాంటీ ఎలర్జీ డ్రాప్స్ ఉంటాయి. వీటిని ఓ 10 రోజులు వాడితే సరిపోతుంది. ఎండలో తిరిగినా.. బలంగా వీచే గాలిలో ఉన్నా ఈ విధంగానే కళ్లు ఎర్రబాడటం సహజం.. అలాగే గ్లకోమా వ్యాధి ఉన్నవారికి కూడా ఇలాగే కళ్లు ఎర్రబడతాయి.
టీవీ, కంప్యూటర్లు ఎక్కువగా చూసేవారికి కూడా కళ్లు ఇలాగే ఎర్రగా మారతాయి. మాములు సమయంలో కూడా కంట్లో నీరు వస్తే, అప్పుడు వారి కళ్లు ఎలర్జీ బారిన పడినట్లు. కంటి నల్ల గుడ్డు చుట్టూ పచ్చని చుక్కలు ఏర్పడినట్లైయితే వారి కళ్లపై అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం. ఇలాంటి వారు ఎక్కువగా ఎండలో తిరగకూడదు.. వృద్థులకు కూడా ఇది వస్తుంది. కంట్లో మెంబ్రేన్ ఉంటుంది. దీన్ని కంజెక్టివా అంటారు.కంట్లో దురద, మంట ఉంటే కంజెక్టివీస్ అంటారు. ఇలాంటపుడు కళ్లు పింక్ కలర్‌లోకి మారిపోతాయి. రానురాను ఎర్రగా అవుతాయి. కళ్ల నుంచి దురద వస్తుంది. నీరు కారుతుంది. ఇన్ఫెక్షన్, వైరస్, బ్యాక్టిరియా సోకినపుడు కళ్లు ఎర్రగా మారతాయి. మందు తాగేవారిలో, బాగా ఏడ్చినపుడు కూడా కళ్లు ఎర్రబడతాయి.’
ఇలా వచ్చినప్పుడు గ్లాసెస్ ధరిస్తారు..ఒకవేళ కళ్లు ఉబ్బి ఉంటే వైద్యులను సంప్రదించాలి. కాటన్‌ను కోల్డ్ వాటర్‌లో డిప్ చేసి కళ్ల చుట్టు అద్దాలి. కళ్లపై ఇన్ఫెక్షన్స్ సోకినపుడు టీ బ్యాగ్స్ పెట్టుకున్నా మంచిదే. నీళ్లలో ఉప్పు వేసి దాంతో కళ్లు కడుక్కోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. గ్రీన్ టీ బ్యాగ్స్ రెండు నీటిలో వేడిచేసి ఆ నీటిని చల్లార్చి కళ్లను కడుక్కున్నా రిలీఫ్ అవుతుంది.