నారా నందమూరి ఫ్యామిలీ సెలబ్రేషన్స్.. ఫొటోస్ వైరల్

-

ఏపీలో కూటమి విజయదుందుభి సాగిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్, జనసేన కూటమి ఘన విజయంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

చంద్రబాబు మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి తాతకు, బంధువులకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఉత్సాహంగా కనిపించారు. సంబురాల్లో భాగంగా చంద్రబాబు నాయడుడి కుటుంబంతో పాటుగా నందమూరి బాలకృష్ణ ఫ్యామిలి ఒక్కరినొక్కరు ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా కనిపించారు. లోకేశ్ సైతం ఉత్సాహంగా కనిపించారు. కేక్ కట్ చేసిన అనంతరం నారా భువనేశ్వరితో పాటుగా చంద్రబాబుకు లోకేశ్ కేక్ తినిపించారు. ఇక చంద్రబాబు ఇంటి ముందు తెలుగుదేశం అభిమానులు బారులు తీరారు. చంద్రబాబు నాయుడి ఇంటి పరిసరాలు మొత్తం జై బాబు, సీఎం అంటూ నినాదాలతో మార్మోగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news