జగన్‌ సర్కార్‌పై నారా బ్రాహ్మణి సంచలన పోస్ట్‌ !

-

జగన్‌ సర్కార్‌పై నారా బ్రాహ్మణి సంచలన పోస్ట్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం వైకాపాకు తగదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. “ప్రభుత్వ, బహుళ జాతి సంస్థలను వైకాపా అపహాస్యం చేస్తోంది. పాలనలో వైసీపీ నేతలు అసమర్థులు. సీమెన్స్ మాజీ ఎండి అన్ని అనుమానాలు నివృత్తి చేశారు. వైసీపీ నేతలు మాత్రం కళ్ళు ఉండి కూడా వాటిని చూడలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు చంద్రబాబు వెంట ఉన్నారు” అని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు.

Nara Brahmani sensational post on Jagan Sarkar

ఇది ఇలా ఉండగా, నారా బ్రాహ్మణిపై ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణీని రంగంలోకి దింపారని.. తీరా ఈ అస్త్రం కూడా తుస్సుమందంటూ చురకలు అంటించారు. దొరికిన దొంగను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా?? అని నిలదీశారు. దేవాన్ష్ కు పొరపాటున కూడా సీఐడీ రిమాండ్ రిపోర్ట్ చూపించకండని.. మా తాత ఇంత అవినీతి పరుడా అనుకుంటాడని ఎద్దేవా చేశారు ఏపీ మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version