జానీ మాస్టర్‌ ఇలా చేస్తూంటే..రేవంత్‌రెడ్డి నిద్రపోతున్నాడా ? – బీజేపీ మహిళా మోర్చా

-

జానీ మాస్టర్‌ ఇలా చేస్తూంటే..రేవంత్‌రెడ్డి నిద్రపోతున్నాడా ? అంటూ ఆగ్రహించారు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యువతిపై డ్యాన్స్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నామన్నారు. ఇది లవ్ జిహాద్ కేసు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. దీనికి హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు.

jani master cm revanth reddy

రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా హోంశాఖపై ఒక్కసారి కూడా సమీక్షించలేకపోవడంతో శాంతిభద్రతల పరిస్థితి మరింత దిగజారిందని ఆగ్రహించారు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను తేలికగా తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై వేధింపులకు, లవ్ జిహాదీ చర్యలకు పాల్పడిన షేక్ జానీపై గతంలోనూ నేరచరిత్ర ఉందని, 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు ఆరునెలల పాటు జైలుశిక్ష విధించినట్లు స్వయంగా పోలీసులే వెల్లడించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి, చట్టపరంగా పారదర్శకంగా విచారణను జరిపించేలా చర్యలు తీసుకోవాలి, లేనిపక్షంలో బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని శిల్పా రెడ్డి హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version