వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వోపై బాబు సీరియస్‌ యాక్షన్‌ !

-

విజయవాడ వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీరియస్ అయింది. వీఆర్వోను విధుల నుంచి తప్పించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. వీఆర్వో జయలక్ష్మీకి షోకాజ్ నోటీసిచ్చిన కలెక్టర్ సృజన….వీఆర్వోను విధుల నుంచి తప్పించారు.
బాధితులతో సంయమనంగా వ్యవహరించాలని ఇప్పటికే చంద్రబాబు సూచనలు చేయడం జరిగింది.

Nara Chandrababu Naidu government is serious about VRV Jayalakshmi’s actions against Vijayawada flood victims

బాధల్లో ఉన్న బాధితులు ఓ మాట అన్నా.. ఓపిగ్గా సమాధానం చెప్పాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆదేశిస్తున్నా మారడం లేదు కొందరి ఉద్యోగుల తీరు. ఇక తీరు మారని ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించనున్న నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం… వెంటనే చర్యలు తీసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version