ఉప ఎన్నికల్లో దానం నాగేందర్ ను ఓడిస్తాం.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన కొందరూ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వారిలో ముఖ్యంగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ వంటి పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. గతంలో పార్టీ ఫిరాయించినప్పటికీ ఇలాంటి తీర్పులు కోర్టులు ఇవ్వలేదని పలువురు పేర్కొంటున్నారు.

ఈ మేరకు నాలుగు వారాల్లో ఆ ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రెటరీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ధర్మాసనం తీర్పు పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ గుర్తు పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు పక్కా అని జోస్యం చెప్పారు. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ నాయకులను అవమానపరిచేలా దుర్బాషలాడిన దానం నాగేందర్ ను ఉప ఎన్నికల్లో ఓడించి తీరుతామని సవాల్ విసిరారు కౌశిక్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version