కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం ఉంటుందని తెలిపారు కేంద్రమంత్రి రామ్మోహన్. సీ ప్లేన్ ఆపరేషన్స్ కు కేవలం రాష్ట్రాన్నే కాదు దేశ గతినే మార్చే శక్తి ఉందని వివరించారు. చంద్రబాబు సూచన మేరకే పాలసీ లో కొన్ని మార్పులు చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు. చంద్రుడు మన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నిత్య పున్నమి ఉంటుందని పున్నమి ఘాట్ సాక్షిగా చెబుతున్నా అని తెలిపారు.
అతి చిన్న దేశం మాల్దీవుస్ లో సీ ప్లేన్ ద్వారా చాలా ఆదాయం వస్తుందని తెలిపారు. అలాంటిది 140 కోట్ల జనం, 1350 దీవులు ఉన్న భారత దేశం లో సీ ప్లేన్ ఆపరేషన్స్ ఒక విప్లవం కానున్నాయని వివరించారు. అందుకు అమరావతినే మొదటి వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోనే సీ ప్లేన్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభం కానుందన్నారు. కొన్ని మార్గదర్శకాలు మార్చి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేట్లు స్కీం ను రూపొందిస్తున్నామని వివరించారు. ఎయిర్ పోర్ట్ కట్టాలంటే కనీసం 500 ఎకరాల అవసరం లేకుండా వాటర్ ఏరో డ్రోమ్స్ సహాయంతో ఎయిర్ ట్రావెల్ కు అవకాశం ఉందని వెల్లడించారు.