టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27వ తేదీ నుండి యువగళం పేరుతో పాదయాత్రని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్రని ప్రారంభించిన రోజు నుండి వైసీపీ ప్రభుత్వం ఆయన చేపట్టిన పాదయాత్రకి అడ్డంకులు సృష్టిస్తుందని టిడిపి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే మరోసారి తన పాదయాత్రని వైసీపీ సర్కార్ అడ్డుకోవాలని చూస్తుందని అన్నారు నారా లోకేష్. సోషల్ మీడియా వేదికగా ఆయన పోలీసు వాహనం యొక్క ఫోటోని షేర్ చేస్తూ.. “నేనంటే ఎందుకింత భయం జగన్?” అన్నారు.
“ఈ సెల్ఫీలో నా వెనుకున్న వాహనం చూశారా? అదేనండి వజ్ర వాహనం. మతకలహాలు, ఘర్షణలు చెలరేగినప్పుడు ఉపయోగిస్తారు కదా! అదే. ప్రశాంతంగా సాగుతున్న నా పాదయాత్రకి రక్షణ కల్పించాల్సిన పోలీసులు జగన్ రెడ్డి ఆదేశాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. అంతకుమించి వజ్రవాహనం అవసరం ఏమొచ్చింది? నేనంటే జగన్ రెడ్డికి భయం. అందుకే అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నా పాదయాత్ర సుబ్బనాయుడు కండ్రిగ గ్రామం చేరింది. నా వెంట పోలీసులు, ఇదిగోండి ఈ వజ్రవాహనం కూడా జగన్ రెడ్డి గారు పంపారు. ఇవి చూశాక మీరే చెప్పండి నేనంటే జగన్‌కి ఎందుకింత భయం?” అని ప్రశ్నించారు.