కువైట్‌లో చావే దిక్కంటూ కార్మికుడు కన్నీరు.. స్పందించిన మంత్రి నారా లోకేశ్‌

-

ఉపాధి కోసం, కుటుంబానికి మంచి జీవితాన్ని అందించాలన్న ఉద్దేశంతో చాలా మంది కన్నవాళ్లను, కట్టుకున్న భార్యను, పిల్లలను, పుట్టిన ఊరును, చివరకు దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతోంది. అలా విదేశాలకు వెళ్లి అక్కడి యజమానుల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్న వారిపై జరుగుతున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. అలా తాజాగా కువైట్‌లో వేధింపులకు గురైన ఓ కార్మికుడు తన ఆవేదనను ఓ వీడియో రూపంలో విడుదల చేశారు.

ఈ వీడియోపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. వేధింపులకు గురైన వ్యక్తిని గుర్తించినట్లు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బృందం బాధితుడిని సంప్రదిస్తుందించి.. కేంద్రం సహకారంతో బాధితుడిని ఏపీకి తీసుకొస్తామని తెలిపారు. కువైట్‌లో దుర్భర జీవితం గడుపుతున్నామని ఇటీవల ఓ తెలుగు కార్మికుడు కన్నీటి పర్యంతమయ్యాడు. సాయం చేయకపోతే చావే దిక్కంటూ వీడియోలో గోడు వెల్లబోసుకున్నాడు. దీంతో తాజాగా స్పందించిన లోకేశ్‌ ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news