ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడు ఇతడే.. ధ్రువీకరించిన ఎఫ్‌బీఐ

-

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఎఫ్‌బీఐ..  ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని తాజాగా గుర్తించింది. అతణ్ని 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌గా ధ్రువీకరించింది.  ప్రభుత్వ ఓటింగ్‌ రికార్డుల ప్రకారం .. పెన్సిల్వేనియాలోని బెతెల్‌ పార్క్‌కు చెందిన వ్యక్తిగా తెలిపింది. అతడు రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదాడిగా  నమోదు చేసుకున్నాడు.

2021 సంవత్సరంలో 15 డాలర్లను డెమొక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసీవ్‌ టర్న్‌ఔట్‌ ప్రాజెక్టకు విరాళంగా ఇచ్చాడు.  ప్రస్తుతం క్రూక్స్‌ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆ మార్గంలోకి ఎవరినీ రానీయడంలేదు. మరోవైపు దుండగుడు క్రూక్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ముందుగానే నెట్టింట వైరలయ్యాయి. కొన్ని మీడియా సంస్థలు సైతం అనుమానితుడిగా పేర్కొంటూ అతడి ఫొటోలను ముందే ప్రసారం చేశాయి. ట్రంప్‌ ప్రసంగించడానికి ఏర్పాటు చేసిన వేదికకు 130 గజాల దూరం నుంచి దాడి జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అతణ్ని మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news