నారాయణ మెడికల్ కాలేజీలో దారుణం.. మనస్థాపంతో విద్యార్థి బలవన్మరణం

-

ఈ మధ్య కాలంలో మెడికల్ కళాశాల్లో, ఆసుపత్రిల్లో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే కోల్ కతాలో ఓ జూనియర్ డాక్టర్ అనుమానస్పదంగా అత్యాచారం, హత్యకు గురైన సంఘటన తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో పలు సేవలను బంద్ చేసారు డాక్టర్లు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ బీడీఎస్ చదివే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్లితే..  అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ప్రదీప్ పట్టణంలోని నారాయణ మెడికల్ కళాశాలలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ తరుణంలోనే కొన్నాళ్ల నుంచి ప్రదీప్ ను రాహుల్ అనే ఎంబీబీఎస్ విద్యార్థి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రదీప్, రాహుల్ వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పి సోమవారం రాత్రి సోదరుడికి మెసేజ్ చేసి కళాశాల బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుడి చావుకు కారణమైన నిందితుడు రాహుల్ ని వెంటనే శిక్షించాలని కోరుతూ మార్చురీ వద్ద బందువులు, కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news