బాబు ఓ డెకాయిట్‌…ఇద్దరు పీకేలను తిట్టి..ఇప్పుడు వాళ్లనే – నారాయణ స్వామి

-

ఇద్దరు పీకేలను విమర్శించి వాళ్ళనే పక్కన పెట్టుకున్నాడు చంద్రబాబు అనే డెకాయిట్ అంటూ ఫైర్‌ అయ్యారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ప్రారంభించిన డిప్యూటీ సిఎం నారాయణ స్వామి అనంతరం మాట్లాడారు.

narayana swamy on prasanth kishore

చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృధి, సంక్షేమం పాలన అందించ లేదన్నారు. చంద్ర బాబు ఎస్సీలు అంటే చిన్నచూపు చూసే నైజం మొదటి నుంచి అదే వైఖరి అని…
చంద్రబాబు లాంటి అవినీతి వ్యక్తిని తాను చూడలేదని మండిపడ్డారు.

ప్రశాంత్ కిషోర్ పవన్ కళ్యాణ్ పై అనేక విమర్శలు చేసిన వ్యక్తి చంద్రబాబు…తాను చేసింది చెప్పుకోలేని వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. పొత్తులతో అధికారంలోకి రావాలని చూస్తున్నాడు చంద్రబాబు…అభ్యర్థుల మార్పు పార్టీ అంతర్గత విషయం అన్నారు. దళితులను నేటికీ గౌరవించని వ్యక్తి చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

Read more RELATED
Recommended to you

Latest news