ఏపీ సీఎస్‌గా నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌?

-

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త సీఎస్‌గా ఆయన పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. బుధవారం రోజున ఆయన ఉండవల్లి నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏపీ నెక్స్ట్ సీఎస్ ఆయనే అని ప్రచారం జరుగుతోంది.

1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. సీఎస్‌గా ఆయన నియామకంపై ఈరోజు (జూన్ 7వ తేదీ) ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత సీఎస్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన జూన్‌ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. మరోవైపు సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు. రెండు రోజుల్లో మరో ఇద్దరు, ముగ్గురు అధికారులనూ నియమించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news