తెలంగాణ వైద్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

-

తెలంగాణలో నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది ప్రభుత్వం. ఇటీవలే రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది.  పబ్లిక్ హెల్త్, ఆయుష్, డ్రగ్ కంట్రోల్, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అలాగే ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వైద్యారోగ్య సర్వీసు నియామక బోర్డు ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌లో 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 1255 పోస్టులు భర్తీ చేయనుంది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లో 11, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటిక్ మెడిసిన్‌లో34 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వైద్యశాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతిస్తూ మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2021 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్నటువంటి 4,356 పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని ఆదేశించింది. అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో నోటిఫికేషన్ పెండింగ్ పడింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగియడంతో ఉద్యోగాల భర్తీ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ రిక్రూట్ మెంట్ లో డాక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్టాప్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం వంటి పోస్టులున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news