ఏపీ పదవ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే…ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పదవ తరగతి ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ఏపీ: ప్రైవేటు స్కూళ్ల అనుమతుల కోసం కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు.. దరఖాస్తు చేసుకోవటానికి ప్రత్యేక పోర్టల్‌ను లాంచ్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.
ఇక పదో తరగతి పరీక్షలు పూర్తి అయిన 18 రోజుల్లో ఫలితాలను విజయవంతంగా విడుదల చేశామని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఎలాంటి లీకేజీలు లేకుండా మొత్తం ప్రక్రియ నిర్వహించామని వెల్లడించారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది అందరికీ అభినందనలు చెప్పారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు.