ఈజీ ఖర్భూజ స్మూతీ తో.. వేసవిలో బాడీ కూల్..!

-

వేసవికాలంలో ఎండలు మండిపోతుంటాయి. అలాంటప్పుడు చల్లచల్లగా ఏదైనా తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. వేసవికాలంలో మీరు ఏదైనా చల్లటి పానీయాన్ని తీసుకోవాలనుకుంటే క్షణాల్లో కర్పూజ స్మూతీని తయారు చేసేసి తీసుకోవచ్చు. దీన్ని తీసుకుంటే ఎంతో రిఫ్రిష్ గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదే. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి క్షణాల్లో కర్బూజ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

ఒక కప్పు కర్బూజా ముక్కలు
ఒక అరటిపండు
అరకప్పు స్వీట్ లేని బాదంపాలు
ఒక టేబుల్ స్పూన్ తేనె
అర టీ స్పూన్ వెన్నెల ఎక్స్ట్రాక్ట్
పావు టీ స్పూన్ దాల్చిన చెక్కపొడి

తయారు చేసుకునే పద్ధతి:

ముందుగా తొక్క తీసి కర్పూజా అరటి పండుని ముక్కలు కింద చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో కర్పూజ అరటిపండు ముక్కల్ని వేసి బాదంపాలు, తేనె, వెన్నెల ఎక్స్ట్రాక్ట్, దాల్చిన చెక్క పొడి అన్నిటినీ వేసి బాగా మిక్సీ పట్టాలి. ఒకవేళ ఇది బాగా గట్టిగా ఉంటే కొంచెం బాదం పాలు వేసుకోండి. ఇప్పుడు సర్వ్ చేసుకుని వేసవిలో చల్లగా ఎంజాయ్ చేయండి.

కంటి ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. బీపీ రెగ్యులేట్ అవుతుంది ఎనర్జీ కూడా వస్తుంది క్యాలరీలు కూడా చాలా తక్కువ ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అజీర్తి సమస్యలు ఏమి ఉండవు హైడ్రేట్ గా ఉండొచ్చు. డీహైడ్రేషన్ సమస్య కూడా ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version