వచ్చే ఏడాది IB సిలబస్ ప్రారంభం అవుతాయన్నారు మంత్రి బొత్స. విశాఖలోని ఉత్తరాంధ్ర వైసీపీ న్యాయ విభాగం సర్వసభ్య సమావేశంలో మంత్రి బొత్స సత్యన్నారాయణ మాట్లాడుతూ….వచ్చే ఏడాది IB సిలబస్ తో ఫస్ట్ క్లాస్ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం అప్పులు చేశామన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ రాకుండా వుండాలంటే మరోసారి వైసీపీ అధికారం చేపట్టాలని కోరారు.
ప్రతిపక్షాలు గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించి ప్రభుత్వం ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తాయి…కుట్రలను తిప్పికొట్టేందుకు పార్టీ న్యాయవాద విభాగం అప్రమత్తంగా వుండాలన్నారు. ఎప్పటి పిటీషన్ లను అప్పుడే ధీటుగా ఎదుర్కోవాలని వివరించారు. విశాఖ ను రాజధాని గా ప్రకటించడం ఎవరి మీదో కక్షతో చేసిన నిర్ణయం కాదు….అభివృద్ధి వికేంద్రీకరణ కోసం చేసిన ఆలోచన అని వెల్లడించారు. లక్ష 19వేల కోట్ల తో అమరావతి నిర్మాణ ప్రణాళిక 15ఏళ్ల కాలంలో 20లక్షల కోట్లకు పెంచే ప్రయత్నం చేశారు….లక్షల కోట్లు పెట్టీ 50 వేల ఎకరాలలో అభివృద్ధి చేయడం అవసరమా….?. 10 వేల కోట్లు పెడితే వైజాగ్ దేశం గర్వించదగ్గ రాజధానిగా మార్చడం అవసరం అని భావించామని చెప్పారు.