బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్?

-

సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు చేవెళ్ల బీఆరెస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. పార్టీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు వరుసకట్టి వీడుతున్నారు. ఇప్పటికే ఐదురుగు ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక కీలక నేతలు కూడా చాలా మంది కారు దిగారు.

talasani srinivas yadav as secunderabad brs mp

తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా ప్రకటించిన గంట వ్యవధిలో ఆయన ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఈ ఇరువురు నేతలు హస్తం కండువా కప్పుకున్నారు. ఇక సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ దాదాపు ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. దీంతో అయోమయంలో బొంతు రామ్మోహన్ భవితవ్యం ఉంది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news