బఫర్ జోన్, FTL ను ఎక్కడ కూడా టచ్ చేయలేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. నిర్వాసితులను ఆదుకున్న తరువాతనే పని ప్రారంభిస్తామని మంత్రి కీలక ప్రకటన చేశారు.
మూసీ నదిని శుద్ధి చేయడానికి రూ.500 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. విపక్షాల కుట్రలను హైదరాబాద్ ప్రజలు గమనిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూసీ రివర్ బెడ్ సర్వే జరుగుతుందని.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పిస్తామని తెలిపారు. “ప్రజల పై ప్రేమ నన్ను కలిసి మీ అభిప్రాయాన్ని పంచుకోండి కేటీఆర్” అని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు మాటలు చెప్పారు తప్పా.. ఏనాడు పని చేయలేదని మండిపడ్డారు.