నంద్యాలలోని ఆర్.కే.ఫంక్షన్ హాల్ లో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్టీ పొలిటికల్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన ోటే పీఏసీ రెండో మీటింగ్ ఇక్కడ నిర్వహించామని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక కొంతమంది మరణించారు. వాళ్ల కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 3, 4 కోర్టులో జడ్జిమెంట్ ఉన్నాయి. జడ్జిమెంట్ వచ్చిన తరువాత చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తామని బాలకృష్ణ పేర్కొన్నారు.
నా చెల్లి నారా భువనేశ్వరి ఈ దీక్షలో కూర్చుంటారని తెలిపారు బాలయ్య. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు టీడీపీ తరపున మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. మా పార్టీ తరపున ఐదు మందిని, జనసేన తరుపున 5 మందితో కమిటీ వేస్తామని చెప్పారు. దెబ్బకు దెబ్బ తీస్తాం. మేము ఎవ్వరికీ భయపడం అని బాలయ్య పేర్కొన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్న ఫైబర్ గ్రిడ్ కేసు పెడతామంటున్నారు. గ్రిడ్ లో అవినీతి జరిగినట్టు నిరూపించాలి..
దేనికైనా రెడీగా ఉన్నాం. అవినీతి చేసిన వారికే భయం. టీడీపీకి జైళ్లంటే భయం కాదు. కేసులకు, అరెస్టులకు భయపడే రకం కాదు.. వాళ్లు కేసులకు, జైళ్లకు వాళ్లు భయపడాల్సిందే.. కానీ మేము భయపడం. నీతిగా ఉన్నోడు దేవుడికే భయపడను. అవినీతి చేయలేదు. ఎలాంటి భయం లేదు. ఆయన పిక్క మీద ఉన్న ఎంట్రుక ఎవ్వడూ పీకలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు బాలయ్య బాబు.