చంద్రబాబు అరెస్ట్ అనంతరం తనయుడు నారా లోకేష్ ఢిల్లీ కి వెళ్లి తండ్రిని ఎలాగైనా బయటకు తీసుకురావాలన్న ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నాడు. అందులో భాగంగానే రాష్ట్రపతికి మొరపెట్టుకోవడం, ప్రధాని అమిత్ షా ల అపాయింట్మెంట్ ల కోసం ప్రయత్నించడం మనము చూశాము. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు జగన్ అభిమానులు లోకేష్ భయంతో ఢిల్లీ పారిపోయాడు.. ఎక్కడ సిఐడి అరెస్ట్ చేస్తుందో అని దాక్కున్నాడు అంటూ రోజుకో విధంగా కామెంట్ చేస్తున్నారు. తాజాగా లోకేష్ మీడియా ముందుకు వచ్చి నేనెక్కడా దాక్కోలేదు, ఢిల్లీ లో ఉన్న మౌర్య హోటల్ లోనే ఉన్నాను.. అప్పుడప్పుడు గలా జయదేవ్ ఇంటికి వెళ్లి వస్తున్నాను, సిఐడి ఎప్పుడు నా దగ్గరకు వచ్చి నోటీసులు ఇస్తే సంతోషంగా తీసుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళు అంటున్నట్లు దాక్కునే అలవాటు నాకు లేదు రాదు అంటూ లోకేష్ వైసీపీ వాళ్లందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.