ఏపీలో బాణసంచా దుకాణాలకు నోటీసులు వచ్చినట్లు సమాచారం అందుతోంది. బాణసంచా దుకాణాల యజమానులకు పోలీసులు నోటీసులు ఇచ్చి విజ్ఞప్తిలు చేస్తుననారు. ఏపీ ఎన్నికల ఫలితాల రోజున బాణసంచా అధిక విక్రయాలు జరపకూడదని పలు దుకాణాలకు నోటీసులు కూడా ఇచ్చారట.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధిక మొత్తంలో బాణసంచా విక్రయాలు జరపకూడదని ఉండవల్లిలోని బాణసంచా దుకాణ యజమానికి నోటీసులు జారీ చేశారట పోలీసులు. కోడ్ అమలులో ఉన్నందున ఫలితాల రోజున బాణసంచా పేల్చి కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సిఐ కళ్యాణ్ రాజు.