ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఆ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖలోని సమగ్రశిక్షా సొసైటీ నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. మొత్తం 1358 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ మేరకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన మహిళా అభ్యర్థులు మే 30 నుంచి జూన్ 4 తేదీ రాత్రి 11.59గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిన్సిపాల్ 92 పోస్టులు ఉండగా.. పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్ 846; సీఆర్టీ 374, పీఈటీ 46 చొప్పున పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు.. ఆయా ఉద్యోగాలను బట్టి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీలలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: జనరల్ అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు అయిదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల చొప్పున వయో సడలింపు ఉంటుంది.