దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ శనివారం వార్నింగ్ ఇచ్చాడు. ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం వీరమ్మకుంట సర్పంచ్ స్థానానికి ఇవాళ పోలింగ్ జరిగింది. ఈ స్థానంలో విజయం సాధించాలని టీడీపీ, వైసీపీ పట్టుదలతో ఉన్నాయి. ఉదయం వీరమ్మకుంట పోలింగ్ కేంద్రం వద్దకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెళ్తున్న సమయంలో నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ ఆపారు.
రౌడీ షీటర్ ను పోలింగ్ కేంద్రం వైపు రావద్దని డీఎస్పీ కోరారు. రౌడీ షీటర్ అయితే ఎందుకు బౌండోవర్ చేయలేదని.. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డీఎస్పీ అశోక్ కుమార్ ని ప్రశ్నించారు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న అందరినీ పంపితే తాను కూడా వెనక్కి వెళ్లిపోతానని చింతమనేని ప్రభాకర్ చెప్పారు. ముదు తనకు మీరు సహకరించాలని.. చింతమనేని ప్రభాకర్ ని కోరారు డీఎస్పీ అశోక్ కుమార్. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను గ్రామంలోకి అనుమతించాలని ఆ గ్రామానికి చెందిన కొందరూ టీడీపీ నేతలు డీఎస్పీని కోరారు. డీఎస్పీ మాత్రం నిరాకరించారు.