శ్రీవారి భక్తులకు శుభవార్త..16వ తేదీ నుంచి ఆఫ్‌ లైన్‌ దర్శన టోకెన్లు

-

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త టీటీడీ పాలక మండలి. ఈ నెల 16వ తేదిన అనేక కార్యక్రమాలకు ముహుర్తం పెట్టింది టిటిడి. ముఖ్యంగా ఈ నెల 16వ తేదీ నుంచి సర్వదర్శనం భక్తులుకు ఆఫ్ లైన్ లో దర్శన టోకేన్లు జారీ చేయనుంది టిటిడి పాలక మండలి. తిరుపతిలో రోజుకి 10వేల చోప్పున టోకేన్లు జారీ చేయాని నిర్ణయం తీసుకుంది.

అలాటే.. ఈ నెల 16 వ తేదీ ఉదయం 9:30 గంటలకు ఆకాశగంగ వద్ద హనుమంతుడి ఆలయ అభివృద్ది పనులుకు భూమి పూజ నిర్వహించనుంది టీటీడీ పాలక మండలి. హనుమంతుడు జన్మస్థలం తిరుమలగా పేర్కొనే.. ఆధారాలతో కూడీన పుస్తకాలను అదే రోజున విడుదల చేయాలని నిర్నయం తీసుకుంది టిటిడి పాలక మండలి.

16వ తేదిన తరిగోండ వెంగమాంబ బృందావనం అభివృద్ది పనులుకు శ్రీకారం చుట్టడంతో పాటు.. ఉదయాస్తమాన సేవా యాప్ ను విడుదల చేయనుంది. ఇది ఇలా ఉండగా.. నిన్న శ్రీవారిని 35,516 మంది భక్తులు దర్శించు కోగా.. 13,797 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్నటి హుండీ ఆదాయం రూ. 2.53 కోట్లు దాటేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version