ఓమైగాడ్… ఒక్కో షేర్ వాల్యూ 40లక్షలా..!

-

కరోనా టైంలో అన్ని వ్యాపారాలు కుదేలవుతున్నాయి. ఉద్యోగాలు పోతున్నాయి. జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇదంతా కాయిన్ కి వన్ సైడ్.. మరి సెకండ్ సైడ్ ఎట్లుందో తెలుసా..! స్టార్టప్స్ కంపెనీలు మాత్రం దూసుకెళుతున్నాయి. యూనికార్న్ లిస్ట్ లోకి చేరే స్టార్టప్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వీటి విలువ ఆకాశాన్ని అంటుతోంది.

money

ఈ మహమ్మారి దెబ్బకి ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడింది. అయినా ఇండియన్ స్టార్టప్ లు మాత్రం రెచ్చిపోతున్నాయి. యూనికార్న్ లిస్ట్‌లో పలు స్టార్టప్‌లు వచ్చి చేరాయి. కరోనా కాలంలోనూ 8 స్టార్టప్స్ యూనికార్న్ లిస్ట్‌లోకి చేరాయి. 2025 నాటికి దేశంలో 100 యూనికార్న్స్ ఉండొచ్చనే అంచనాలున్నాయి. గ్రే మార్కెట్‌లో ఈ కంపెనీల విలువ ఆకాశాన్ని తాకుతోంది. పలు స్టార్టప్‌లకు సంబంధించి షేరు విలువ మీరు ఊహించలేనంత స్థాయికి చేరాయి. ఓయో రూమ్స్ షేరు విలువ ఏకంగా రూ.35 నుంచి రూ.40 లక్షల మధ్యలో ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ షేరు విలువ రూ.2.7-2.8 లక్షల వరకు ఉంది. జొమాటో షేరు విలువ రూ.3.1 లక్షలుగా పలుకుతోంది.

కార్గో సర్వీస్ ప్రొవైడర్ రివిగో షేరు అయితే రూ.2.8 లక్షల వద్ద ట్రేడవుతోంది.ఇన్సూరెన్స్ యూనికార్న్ పాలసీ బజార్ షేరు ధర ఏకంగా రూ.7-7.5 లక్షల వరకు ఉంది. ఈ కంపెనీల బిజినెస్ వ్యాల్యూ 1-10 బిలియన్ డాలర్ల మధ్యలో ఉంది. వచ్చే 3 ఏళ్ల కాలంలో ఇంటర్నెట్ కంపెనీల నుంచి 10 సంస్థలు ఐపీవోకు రావొచ్చనే అంచనాలున్నాయి. ఇక స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన షేర్ల విషయానికి వస్తే.. ఈబీటా, ఈవీ, ప్రైస్ టు బుక్ వ్యాల్యూ, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో వంటి పలు అంశాల ప్రాతిపదికన షేరు విలువను లెక్కగట్టొచ్చు. అయితే ఈ గ్రే మార్కెట్‌లో కంపెనీల షేర్లను వివిధ అంశాల ప్రాతిపదికన లెక్కిస్తారట. దాంతో లిస్ట్ అయిన కంపెనీల స్టాక్స్‌ను ఒక్కదానితో మరొకదాన్ని కంఫైర్ చేయటానికి అవకాశం లేదన్నమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version