నూతన సంవత్సరం వేళ.. కాకినాడ బీచ్ లో విషాదం..!

-

సాధారణంగా ప్రతీ కొత్త సంవత్సరం ఎక్కడో ఒక ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ప్రమాదాలు జరుగకుండా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినప్పటికీ అవేమి పట్టనట్టు కొందరూ వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. నూతన సంవత్సరం వేళ.. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇద్దరూ యువకులు గల్లంతయ్యారు. వెంటనే నీటిలో కొట్టుకుపోయారు.

అయితే వీరిలో ఒకరి మృతదేహాన్ని బయటికి తీశారు. కానీ పోస్టుమార్టం కు తరలించారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  మరోవైపు విశాఖ రుషికొండ ఐటీ సెజ్ బీచ్ లో కూడా విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగిన రాయపూర్ వాసి కనోజ్ మరణించాడు. 

Read more RELATED
Recommended to you

Latest news