కర్నూలు మార్కెట్ యార్డులో పేరుకుపోయిన ఉల్లి నిల్వలు..!

-

కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు పేరుకుపోయాయి. వారంలో 3 రోజులు మాత్రమే ఉల్లి కొనుగోళ్లు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఉల్లి అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు రైతులు. అర్ధరాత్రి 12 గంటల వరకు మార్కెట్ యార్డులోకి ఉల్లి లారీలను అధికారులు అనుమతించకపోవడంతో.. 8 గంటలు రోడ్డుపైనే ఉండిపోయాయి ఉల్లి లారీలు. రాత్రి కిలోమీటర్ పొడవునా నిలిచిపోయాయి ఉల్లి లారీలు.

అయితే ఉల్లి అమ్ముకోవడానికి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు.. వారంలో 3 రోజులు కొనుగోళ్ల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లికి డిమాండ్ వున్నా, ధర వున్నా అధికారుల తీరుతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. 10 రోజులుగా ఉల్లి రైతుల సమస్య పరిష్కరించని అధికారులు.. ఉల్లి ఎక్కువగా మార్కెట్ కు వస్తే సమస్య తలెత్తకుండా పరిష్కారం చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారు. అయితే ప్రస్తుతం క్వింటాలు ఉల్లి 2 వేల నుంచి 4,600 వరకు ధర పలుకుతుంది. కొనుగోలులో జాప్యంతో ఉల్లి మురిగిపోయి నష్టపోతున్నారు రైతులు. నాణ్యత దెబ్బతిన్న ఉల్లిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version