“ఆపరేషన్ సిందూర్” పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. జాతీయ భద్రత కోసం జనసేన సర్వమత ప్రార్థనలు, సైనిక బలగాలకు ఆధ్యాత్మిక సంఘీభావంతెలిపారు. జమ్మూ & కాశ్మీర్, పహాల్గంలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కదిలించింది. ఇలాంటి సమయంలో “ఆపరేషన్ సిందూర్” ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద మూలాలపై, వారికి సహకరిస్తున్న పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేసి ఉగ్రమూకలను అంతం చేసి తిరుగులేని ధైర్య సాహసాలను ప్రదర్శించి, భారత్ కు రక్షణ కవచంలా నిలచిన భద్రతా దళాలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు పవన్.

ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారత దేశానికి, రక్షణ బలగాల రక్షణ కోసం తమిళనాడు లోని దేవ సేనాని శ్రీ సుబ్రమణ్య స్వామి వారి 6 షష్ట షణ్ముఖ ఆలయాల్లో, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 4 సుబ్రమణ్య స్వామి ఆలయాల్లో, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి ఆలయంలో, అరసవల్లి శ్రీ సూర్య నారాయణ ఆలయంలో, ఇతర ఆలయాలు, మసీదుల్లో, చర్చిల్లో సర్వమత ప్రార్థనలు చేసిన జనసేన నాయకులకు, జనసైనికులు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని వెల్లడించారు.