ప్రేమ పేరుతో మైనర్‌ను ట్రాప్ చేసిన యువకుడు

-

ప్రేమ పేరుతో మైనర్‌ను ట్రాప్ చేసాడు యువకుడు. అక్కను ట్రాప్ చేసి చెల్లిని కూడా తీసుకురావాలని బలవంత పెట్టాడు యువకుడు. ఆత్మహత్యాయత్నానికి బాధితురాలు పాల్పడ్డారు. రాచకొండ పోలిస్ కమీషనర్ రేట్ ఘట్కేసర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్క, చెల్లె ఇద్దరినీ ప్రేమ పేరుతో బ్లాక్‌మెయిల్‌కు అవినాష్ రెడ్డి పాల్పడ్డారు.

ఇన్‌స్టాగ్రాంలో పరిచయమై.. ఫొటోలు, వీడియోలు దిగి చివరకు తనకు ప్రియురాలి చెల్లెలు తనకు కావాలంటూ అక్కను బ్లాక్ మెయిల్ చేశారు అవినాష్. ఫోటోలు వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని వస్తే ఫోటోలు, వీడియోలు డిలీట్ చేస్తానని చెప్పారు అవినాష్ రెడ్డి. తప్పనిసరి పరిస్థితిలో తీసుకెళ్లి ఇచ్చింది అక్క. ప్రియురాలితో చివరకు చెల్లెను తీసుకరమ్మని చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు మైనర్. మైనర్‌ల తండ్రి పిర్యాదుతో కేసు నమోదు చేశారు ఘట్కేసర్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news