ప్రతి పక్ష హోదా నాయకులు ఇచ్చేది కాదు.. ప్రజలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో తాజాగా సీఎం మాట్లాడారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడిపైన కేసులు పెట్టారు. వైసీపీ అహంకారం ప్రదర్శించడం వల్లనే ప్రతిపక్ష హోదా రాలేదు అన్నారు. RRR సినిమాలో నాటు నాటు సాంగ్ ఎంత పాపులర్ అయిందో.. రాజకీయాల్లో రఘురామ కృష్ణం రాజు కూడా అంతే అన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. లాఠీలు, లబ్బర్ బెల్ట్ లతో రఘురామను కొట్టారు. రఘురామను చంపేయాలనుకున్నారు.
ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కుర్చీకే నిండుదనం తీసుకొచ్చారని పేర్కొన్నారు. సొంత పార్టీ ఎంపీ పైనే రాజద్రోహం కేసు పెట్టారు. ఒక్కోసారి ముక్కుసూటిగా మాట్లాడినా సమస్యలు వస్తాయి. కస్టడీలో రఘురామ ఉన్నప్పుడు దాడి చేయడం దారుణం అన్నారు. కల్మషం లేకుండా మాట్లాడే వ్యక్తి రఘురామకృష్ణం రాజు అన్నారు. పుట్టిన రోజు నాడే రఘురామ ను అరెస్ట్ చేశారు. శుక్రవారం అరెస్ట్ చేస్తే.. కోర్టుకు సెలవు కాబట్టి మూడు రోజుల వరకు జైలులో ఉండాలని కుట్రతో అరెస్ట్ చేశారని తెలిపారు.