Chandrababu: ఏపీలోని చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆచార్య NG రంగా యూనివర్సిటీకి భూమిని ఇస్తూ చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం కి 50.21 ఎకరాలు స్ధలం ఉచితంగా ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. తిరుపతి జిల్లా తమ్మింగాని పల్లె లో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసేందుకు స్ధలం ఇచ్చింది సర్కార్.
2012 సెప్టెంబరు లో ఇచ్చిన జీఓలో అంశాలలో ఎటువంటి మార్పు లేకుండా స్ధలం కేటాయించింది ప్రభుత్వం. స్ధలం లే ఔట్ లో, రోడ్లలో, ఇప్పటికి ఉన్న పరిస్ధితిలో ఎలాంటి మార్పు చేయకుండా వినియోగించాలని నిర్దేశించింది చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.