పంతం నెగ్గించుకున్న పరిటాల శ్రీరాం… జేసీకి చెక్!

-

కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనుమరుగైపోయిన అనంతరం జేసీ బ్రదర్స్ టీడీపీ పంచన చేరిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో.. త‌నేదో తెలుగుదేశంలోనే పుట్టి పెరిగిన లెవ‌ల్లో ఆయ‌న చంద్ర‌బాబుకు చేసిన భజన అంతా ఇంతా కాదు! టీడీపీ పుట్టిన్నప్పటినుంచీ పార్టీలో కొనసాగుతున్నవారు సైతం బాబును ఆ రేంజ్ లో పొగడలేదు.. బాబు హార్ట్ కోర్ ఫ్యాన్స్ కూడ ఆశ్చర్యపోయేలా ఫెర్ఫార్మ్ చేశారు! ఈ క్రమంలో.. తాజాగా బాబు, జేసీ ఫ్యామిలీకి తనదైన షాక్ ఇచ్చారని.. అందుకు కారణం పరిటాల ఫ్యామిలీ అని అనంత టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి!

అనంత టీడీపీలో పరిటాల ఫ్యామిలీది ప్రత్యేక స్థానం! అయితే.. కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చిన అనంతరం జేసీ ఫ్యామిలీ డామినేషన్ ఎక్కువగా ఉందని అంటున్నారు హార్ట్ కోర్ టీడీపీ అభిమానులు! దీంతో… అనంతలో ఇప్పటివరకూ టీడీపీని బ్రతికించిన పరిటాల ఫ్యామిలీ… ఇక జేసీ ఫ్యామిలీకి ప్రాధాన్యత తగ్గించమని డిమాండ్ చేశారని.. అలా కానిపక్షంలో పర్యవశానాలకు తాము బాధ్యత తీసుకోలేమని… అల్టిమేట్ గా కార్యకర్తల అభిప్రాయాలు ముఖ్యమని చెప్పారంట!

దీంతో ఫైనల్ గా పరిటాల మాట కాదనే పరిస్థితి బాబుకు లేదు కాబట్టి… పరిటాల శ్రీరాం మాటకే చంద్రబాబు తలాడించారని.. అందులో భాగంగానే… అనంత‌పురం పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం ఇన్ చార్జిగా కాలువ శ్రీనివాసుల‌ను ప్ర‌క‌టించి జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డికి, తద్వారా జేసీ ఫ్యామిలీకి చంద్ర‌బాబు నాయుడు తనదైన ఝ‌ల‌క్ ఇచ్చారని అంటున్నారు విశ్లేషకులు! దీంతో… బాబు యూస్ అండ్ త్రో విధానం జేసీకి స్పష్టంగా తెలిసివచ్చి ఉంటుందని అంటున్నారంట అనంతలో జేసీ అభిమానులు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version