జగ్గు భాయ్ అంటూ ర్యాగింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ !

-

జగ్గు భాయ్ అంటూ ఏపీ సీఎం జగన్‌ ను ర్యాగింగ్ చేశారు పవన్ కళ్యాణ్. తణుకు వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జగన్‌…. నిన్ను జగ్గూ భాయ్ ఎందుకు అంటానో అర్థమైందా… నన్ను దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటే భరించానన్నారు. ఇప్పటి వరకు జగన్ అన్నాము, జగ్గూ భాయ్ అన్నామని తెలిపారు. రేపు జగ్గూ అంటాము. తర్వాత ఏం అంటానో నాక్కూడా తెలియదన్నారు పవన్ కళ్యాణ్.

తానేమీ వాలంటీర్ల కడుపుకొట్టే వ్యక్తిని కానని, రూ.5 వేలకు ఇంకో రూ.5 వేలు కలిపి ఇచ్చే వ్యక్తినని చెప్పుకొచ్చారు.“వాలంటీర్స్… మీరు జగన్ వలన చాలా ఇబ్బంది పడతారు. మీకు తెలియకుండానే మీతో తప్పు చేయిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఒత్తిడికి లొంగి తప్పు చేశారు…. దాని ఫలితంగా జైలుకెళ్లారు. ఇప్పుడు కూడా మీతో అలాగే తప్పు చేయిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news