పవన్ కొత్త స్టెప్: జనసేన – టీడీపీ మళ్లీ కలవబోతున్నాయా..?

-

అసలే చీకటి… అంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్… తప్పు మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారనే కామెంట్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఒంటరి పోరాటం చేయకుండా చంద్రబాబుని నమ్మిన పవన్… అనంతరం ఏమైందో తెలియదు కానీ… విడిపోయారు. అనంతరం ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్లి తన నిజమైన బలం ఎంతో తెలుసుకున్నారు. ఫలితాల అనంతరం బీజేపీతో జత కట్టారు.. క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తగా నడుచుకున్నారు. అయితే తాజాగా బీజేపీ అధిష్టానాన్ని కూడా దిక్కరిస్తున్నారనే కామెంట్లు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి.

అవును… బీజేపీ – జనసేనల మధ్య గ్యాప్ రాబోతుందని అంటున్నారు విశ్లేషకులు. అందుకు కారణం… తాజాగా పవన్ తీసుకున్న నిర్ణయం. తాజాగా కార్యకర్తలతో నాయకులతో వీడియో కాంఫరెన్స్ లో మాట్లాడిన పవన్.. రాజధాని విషయంలో హైకోర్టుకు వెళ్తామని ప్రకటించారు. దీంతో బీజేపీ పెద్దల ఆగ్రహానికి గురవ్వబోతున్నారనే కామెంట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రాజధాని విషయంలో బీజేపీ స్టాండ్ స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే.

అయినా కూడా… బీజేపీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇంతకాలం మెలిగిన పవన్… తాజాగా జనసేన సొంత నిర్ణయాలు ప్రకటించడంపై సర్వత్రా ఆశ్చర్యాలు వయ్క్తమవుతున్నాయి. ఇప్పటికే సోము వీర్రాజు.. ఏపీలో బీజేపీ మనుగడ కోసం చేయాల్సిందంతా పక్కా ప్లానింగ్ తో వెళ్తోన్న క్రమంలో.. పవన్ ఇలా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడంపై బీజేపీ శ్రేణులు షాక్ అవుతున్నాయని అంటున్నారు.

ఇటు బీజేపీతో దోస్తీ కడుతూనే.. అటు పాత మిత్రుడు చంద్రబాబు స్నేహాన్ని కూడా వదులుకోలేకపోవడంతో పాటు.. వ్యక్తిగతంగా కూడా ప్రతిష్ట సంపాదించుకోవాలనే ఆలోచన పవన్ చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఈ నిర్ణయం… బీజేపీ – జనసేనల మధ్య గ్యాప్ తెచ్చె అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది వారి అభిప్రాయంగా ఉంది.

ఇలా.. జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ బీజేపీ స్టాండ్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో… జనసేన విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది అన్న విషయంపై ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. దీంతో… పవన్ ఏదో బీజేపీ పంచన చేరి జనసేనను బ్రతికించి ఉంచుతారని నమ్ముతున్న జనసైనికులు తాజా నిర్ణయంతో కొత్త టెన్షన్ కు గురయ్యారని అంటున్నారు!! మళ్లీ… బాబుతోనే జతకట్టబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తమ్ముళ్లు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version