సీఎం జగన్ ఓ క్రిమినల్ అని మండిపడ్డారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. చంద్రబాబును అరెస్టు చేస్తారని తామేమి ముందుగా ఊహించలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ కోసం ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసుకున్నామన్నారు.
అనుమంచిపల్లి వద్ద మీడియాతో మాట్లాడుతూ…’జగన్ ఓ క్రిమినల్… విదేశాలకు వెళ్లాలన్న కోర్టు అనుమతి కావాలి. అలాంటి వారి చేతిలో అధికారం ఉండడం దురదృష్టం. సీఎం ఎప్పుడూ జైలు గురించి ఆలోచిస్తారు’ అని మండిపడ్డారు. కాగా, వాదనలు అయ్యేవరకు కోర్టులోనే ఉంటానని సంచలన ప్రకటన చేశాడు చంద్రబాబు నాయుడు. విజయవాడ ఏసిబి న్యాయమూర్తి ముందు చంద్రబాబు స్వయంగా వినిపించిన వాదనలు ముగిసాయి. మీరు కోర్టులోనే ఉంటారా? లేదా? అని న్యాయమూర్తి అడగగా… వాదోపవాదనలు అయ్యేవరకు కోర్టు హాలులోనే ఉంటానని బాబు బదులు ఇచ్చారు. అటు చంద్రబాబు తరపున లూథ్ర వాదనలు వినిపిస్తున్నారు.