త్వరలోనే మరికొంత మంది జైలు వెళతారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావ్ హాట్ కామెంట్స్ చేశారు. వాస్తవాలు తెలియనప్పుడు కొందరు కక్షపూరితమని వాక్యానిస్తారు. 2021 లోనే స్కిల్ డెవలప్ మెంట్ లో అవకతవకల పై కేసు రిజిస్టర్ అయ్యిందని.. Fir లో కొన్ని పేర్లు ఉంటాయ్ , ధర్యాప్తులో ఇంకొన్ని వస్తాయ్ తప్పెముందని వెల్లడించారు. తనను అరెస్టే చేయకుడదని అంటే ఎట్లా..? మన రాజ్యాంగ వ్యవస్దలో ఎవరికైనా మినహా ఇంపు ఉందా..? అని ప్రశ్నించారు.
ఏ ధర్యాప్తు సంస్ద అయినా అరెస్ట్ చేసి కొర్ట్ ముందు ప్రవేశపెడుతుందని… బాబు ప్రబుత్వంలో అవినీతి జరిగిందని అనేక ధర్యాప్తు సంస్దలు చెబుతున్నాయని పేర్కొన్నారు. బాబుకి మినహాయింపు ఏముంటుంది.? అమాయక ప్రజల్ని రెచ్చగొడ్డి ఉసిగొల్పడం కరెక్ట్ కాదన్నారు. కోర్టు ముందు తమ నిర్దోషత్వం రుజువు చేసుకునేందుకు అవకాశం ఉందని…ఆరోపణలు వచ్చేప్పుడు స్వచ్చందంగా ముందుకు రావాలని పేర్కొన్నారు. ఏదో రకంగా తప్పించుకొవలని చూడటం కరెక్ట్ కాదని.. ధర్యాప్తు సంస్దలను తప్పుబట్టడం ఏంటి? అని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిందొకటే..? 37 మంది ఇన్వాల్వ్ మెంట్ ఉంది..నిర్దోషిగా బయటకు వచ్చేప్రయత్నం చేయాలన్నారు. దేశంలో ఇదేం కొత్తకాదు , లా అండ్ అర్డర్ సమష్య సృష్టించడం ఏంటి? అంటూ ప్రశ్నించారు ధర్మాన.