ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్క్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు. తాను అరకు పర్యటనలో ఉన్నప్పుడు తన కుమారుడు చదువుతున్న స్కూల్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. సమ్మర్ క్యాంపునకు వెళ్లిన మార్క్ అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడినట్లు ఫోన్ కాల్ లో చెప్పారని వెల్లడించారు. అయితే ప్రమాదం తీవ్రత ఇంతలా ఉంటుందని తాను ఊహించలేదని పేర్కొన్నారు.
నా చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్టు తెలిసింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీశారు. సింగపూర్ హైకమిషనర్ కూడా సమాచారం అందించారు. చంద్రబాబు సహా స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు. అకీరా పుట్టినరోజున ప్రమాదం జరగడం దురదృష్టకరం. పొగ పీల్చడం వల్ల ఇబ్బందులు రావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అని పవన్ కళ్యాణ్ తెలిపారు.