మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ : పవన్ కళ్యాణ్

-

సింగపూర్ లోని సమ్మర్ క్యాంపులో జరిగిన అగ్ని ప్రమాదంలో తన కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని తెలిపారు పవన్ కళ్యాణ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిందని.. ప్రస్తుతం ఆసుపత్రిలో బ్రంకో స్కోపి చేస్తున్నారని తెలిపారు. దీర్ఘకాలంలో పిల్లాడి పై ఈ ప్రభావం ఉంటుందన్నారు. ప్రమాద తీవ్రత ఇంతలా ఉంటుందని అస్సలు ఊహించలేదని చెప్పారు. పెద్ద కొడుకు పుట్టిన రోజునే చిన్న కుమారుడికి ఇలా జరగడం దురదృష్టకరం అన్నారు. 

మరోవైపు మార్క్ శంకర్ ఆరోగ్యం పై ప్రధాని మోడీ కాల్ చేసి ఆరా తీశారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కూడా అడిగి తెలుసుకున్నారని తెలిపారు. తాను అరకు పర్యటనలో ఉండగా మార్క్ శంకర్ కి గాయాలైనట్టు ఫోన్ వచ్చిందని తెలిపారు. సుమారు 30 మంది చిన్నారులు సమ్మర్ క్యాంపులో ఉండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించారు. మార్క్ శంకర్ ఆరోగ్యం పై ఆరా తీసిన ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, నారా లోకేష్, జగన్ కి ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news