ఏపీ.. శ్రీలంక లా మారిపోతుందేమో ? అని అనిపించింది అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం చేసిన పనులు మూలాలు కదిలించేసాయి… ప్రజలు మా నుంచీ చాలా ఆశిస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మేం పాలసీలు చేయగలం కానీ.. వాటిని ప్రజలకు తీసుకెళ్ళేది ఐఏఎస్ లు, ఐపీఎస్ లే అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
గత ప్రభుత్వంలో జరిగిన వాటికి ఐఏఎస్, ఐపీఎస్ లు ఎందుకు మాట్లాడరు అనిపించేది..శ్రీలంక లా మారిపోతుందేమో అనిపించిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన పనులతో మిగిలింది పది లక్షల కోట్ల అప్పు అని.. రాళ్ళు రప్పల మధ్య హైదరాబాదు లాంటి నగరం చంద్రబాబు కు కనిపించిందని వెల్లడించారు.
వారసత్వంగా అప్పులతో వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకెళ్ళాలంటే.. అందరూ కలిసి పని చేయాలి..మంత్రి నాదెండ్ల మూడు చెక్ పోస్టులు పెట్టినా.. ఎలా పీడీఎస్ రైస్ రవాణా జరిగింది అని వెల్లడించారు. . ఇసుక విషయంలో ఎవరైనా చెయ్యి పెడితే కఠిన చర్యలుంటాయని మంత్రులు, ఎంఎల్ఏ లకు సీఎం వార్నింగ్ ఇచ్చారు… ఐఏఎస్, ఐపీఎస్ లు ఏదోటి చేయగలరని నేను బయటి వ్యక్తిగా ఉన్నపుడు అనుకునేవాడిని అని పేర్కొన్నారు.