ప్రజల్లో తిరగడానికి పవన్ కళ్యాణ్ కి సిగ్గుండాలి అన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు అంటే ప్రజలు తిరస్కరించారని అర్థం అని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి నిష్క్రమించాలని అన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పింది మూడు ఆప్షన్లు కానీ.. నాలుగో ఆప్షన్ చంద్రబాబు దగ్గర ప్యాకేజీ ఆప్షన్ అని అన్నారు. చంద్రబాబు రైతులకు ద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువుకాటకాలు విలయతాండవం చేస్తుంటాయి అని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వ హయాంలో 471 మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా? అని ప్రశ్నించారు. దీనికి దత్తపుత్రుడు కూడా సమాధానం చెప్పాలన్నారు.5,500 కోట్ల రూపాయలను సీఎం జగన్ ఒక్క బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తే ఎందుకు హాజరు కాలేక పోతున్నారని, దీనిని కేంద్ర మంత్రి కూడా అభినందించారు అని తెలిపారు. చంద్రబాబుకు నీతి నిజాయితీ ఉందా అంటూ మండిపడ్డారు. రైతులకు ఉచిత కరెంటు ఇస్తే బట్టలు ఆరేసుకోవటమే అని చెప్పిన వ్యక్తి చంద్రబాబని అన్నారు.