చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పుట్టి పెరిగినట్టుంది : సజ్జల

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలకు, కూటమి నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఏ కోశానా నాయకుడి లక్షణాలు లేవని విమర్శించారు.

 

చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పుట్టి పెరిగినట్టు ఉంది అన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించడం లేదు. బాబు బటన్ నొక్కితేనే పవన్ మాట్లాడతారు. కాపుల హక్కుల కోసం ఆయన ఏనాడు అయినా నోరు విప్పారా..? జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకనే కూటమిగా వస్తున్నారు. జగన్ ఓ వైపు.. గుంట నక్కలు మరోవైపు అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version