ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఓ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి సినిమా డైలాగ్ చెప్పడంతో అవి విపరీతంగా వైరల్ గా మారాయి. సినిమా డైలాగ్ చెప్పిన తప్పేనా అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సినిమా డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని అన్నారు.

వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవరైనా సరే నియమాలను తప్పకుండా పాటించాల్సిందేనని చెప్పారు. ప్రజలలో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా ఉండాలని పోలీసులకు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.