ఏపీలో వ్యవసాయ శాఖనే మూసివేయబోతున్నారు : పయ్యావుల

-

వ్యవసాయ శాఖలో జీతభత్యాల పోగా ఈ ప్రభుత్వం రైతు భరోసాకి మాత్రమే ఖర్చు పెడుతున్నారని.. వ్యవసాయ శాఖలోని 11 అంశాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫైర్‌ అయ్యారు. ఇరిగేషన్ కోసం టీడీపీ రూ. 60 వేల కోట్లు ఖర్చు పెట్టాం.. మీరఁత ఖర్చు పెట్టారు..? అని.. అప్పులు పెరిగాయి.. ఆదాయం పెరిగింది.. కానీ ఖర్చు తగ్గుతోంది.. మిగిలిన నిధులు ఎక్కడ పోయాయి..? ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో వ్యవసాయ శాఖనే మూసివేయబోతున్నారంటూ పయ్యావుల సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 48 వేల కోట్లు ఖర్చుకు లెక్కల్లేవంటూ నేను ఏడాది క్రితం చెప్పిన దాన్నే ఇప్పుడు కాగ్ స్పష్టంగా చెప్పిందని.. ప్రభుత్వం లెక్కలకు సర్టిఫికెట్ ఇవ్వడానికి కాగ్ భయపడిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవాలన్నారు.

రూ. 48 వేల కోట్లంటే.. 30 శాతం మేర బడ్జెట్టుకు లెక్కల్లేవని కాగ్ స్పష్టంగా చెప్పిందని.. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం లెక్కలు చూపకుండా ఖర్చు పెట్టేస్తే చూస్తూ ఊరుకోవాలా..? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికైనా కాగ్ అన్ క్వాలిఫైడ్ ఓపీనియన్ ఇచ్చింది.. కానీ తొలిసారిగా ఏపీ ప్రభుత్వ లెక్కలను తప్పు పడుతూ క్వాలిఫైడ్ ఓపీనియన్ ఇచ్చిందని.. లెక్కలకు సంబంధించిన వివరాలు లభ్యం కానప్పుడే కాగ్ క్వాలిఫైడ్ సర్టిఫికెట్ ఇస్తుందన్నారు. నేను ఏడాది క్రితం ఇదే చెబితే… ఆనాడు మంత్రి బుగ్గన నా ప్రకటనపై వెటకారాలు ఆడారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version