జగన్‌ నిర్ణయాలతో విద్యుత్‌ రంగానికి తీవ్ర నష్టం – పయ్యావుల కేశవ్

-

జగన్‌ నిర్ణయాలతో విద్యుత్‌ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుందని పయ్యావుల కేశవ్ ఫైర్‌ అయ్యారు. లక్ష కోట్ల రూపాయల విలువైన సుమారు 20 వేల మెగావాట్ల మేర హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని.. హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను అస్మదీయులకు కట్టబెడుతూ కెబినెట్లో నిర్ణయం తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయని పేర్కొన్నారు. కెబినెట్టులో నిర్ణయాలు ప్రజల కోసం కాకుండా.. అయిన వారి కోసమే నిర్ణయాలు ఉంటున్నాయన్నారు. కెబినెట్లో నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి చిక్కులు తమ మెడకు చిక్కుకోవని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని ఆగ్రహించారు.

నిబంధనలకు విరుద్దంగా హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను తాము బ్యాక్ గ్రౌండుగా ఉన్న కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు..టెండర్ల ద్వారానో.. బిడ్డింగ్ ద్వారానో హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను కేటాయింపులు జరపాలని డిమాండ్‌ చేశారు. నామినేషన్ విధానంలో హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏ విధంగా కట్టబెడతారు..? అని నిలదీశారు. నెడ్ క్యాప్ తో సర్వే చేయించి.. నెడ్ క్యాప్ సంస్థ గుర్తించిన స్థలాల్లో హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రారంభించారని తెలిపారు.ప్రభుత్వ సొమ్ముతో సర్వేలు చేయించుకుని.. టెండర్లు పిలవకుండా ప్రాజెక్టులు నామినేటెడ్ పద్దతిన కట్టబెట్టేస్తారా..? అని ఓ రేంజ్‌ లోఫైర్‌ అయ్యారు పయ్యావుల కేశవ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version