జెసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదని.. జేసీ నన్ను తాడిపత్రిలోకి రానివ్వనంటున్నారని ఫైర్ అయ్యారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. జిల్లా నుంచి నన్ను బహిష్కరించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నా సీఎం?? లేక జిల్లా అధికారా…? అని ప్రశ్నించారు. నాకు కుటుంబం ఉన్నట్టే.. జెసి ప్రభాకర్ రెడ్డికి కూడా కుటుంబం ఉందన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.
తాడిపత్రిలో మళ్లీ అలజడులు సృష్టించడానికి జెసి ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలను జేసీ టార్గెట్ చేశారని ఆరోపణలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. నాకు జామీన్ ఇవ్వకుండా పోలీసులపై జేసీ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎవరెన్ని చేసినా తాడిపత్రి ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. కాగా, తాడిపత్రికి వస్తే… పంచె ఊడదీసి కొడతానంటూ కేతిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు జెసి ప్రభాకర్ రెడ్డి. దీంతో కేతిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.