తిరుపతిలో పోల్యుషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్ మరియు ల్యాబరేటరిని ప్రారంభించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ భవనానికి డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనం గా నామకరణం చేశారు. మొత్తం 16.50 కోట్లతో ఈ నూతన కార్యాలయ భవనం నిర్మించారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ….తిరుపతి లో సొంత భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది…సిఎం శ్రీ వైఎస్ జగన్ పర్యావరణం పై ప్రత్యేక శ్రద్ద తీసుకుని మార్పులు తెచ్చారని తెలిపారు. కొత్త పరిశ్రమలు పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నారు.. జూన్ నెలలో ఎన్నడూ లేని విధంగా 263.13 మిలియన్ మెగా వాట్ల విద్యుత్ వినియోగం పరిశ్రమల ఏర్పాటు కి నిదర్శనం అన్నారు. ఎక్కడా కాలుష్యం లేకుండా కాలుష్య నియంత్రణ మండలి అనేక చర్యలు చేపట్టిందని…మన ప్రభుత్వం వచ్చాక కాలుష్య కారక వ్యర్థాల నియంత్రణ లో చర్యలు చేపట్టామని గుర్తు చేశారు.ఈ నూతన భవనంలో ఒక ల్యాబ్ ను ఏర్పాటు చేశామన్నారు.